రామ్ చరణ్ కు ఇక వేరే దారి లేదా?

రామ్ చరణ్ కు ఇక వేరే దారి లేదా?
రామ్ చరణ్ కు ఇక వేరే దారి లేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ స్పెషల్ వీడియో హైలైట్ అయింది. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన వెంటనే ప్యాన్ ఇండియా దారిలోనే చరణ్ వెళ్లాలని అనుకున్నాడు. అందుకే అగ్ర దర్శకుడు శంకర్ తో సినిమా చేయడానికి కమిటయ్యాడు.

ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా నెలలే గడుస్తున్నా ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. శంకర్ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఉన్నాడు. లైకా సంస్థ శంకర్ ను అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇండియన్ 2 పూర్తవ్వకుండా శంకర్ మరో సినిమా మొదలెట్టకపోవచ్చు.

అది ఇప్పట్లో జరిగే అవకాశమైతే లేదు. ఈ నేపథ్యంలో చరణ్ కు వేరే అప్షన్లు చూసుకోవడం తప్ప వేరే దారి లేదా.