సైరా నరసింహారెడ్డి చిత్రానికి 120 కోట్ల బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మాలని పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట చిరు తనయుడు రాంచరణ్ . ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు చరణ్ . ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని కూడా చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే . ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సైరా ని భారీ రేట్ల కు అమ్మాలని డిసైడ్ అయ్యాడట .

కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలో అది కూడా కేవలం తెలుగు రైట్స్ రూపంలోనే 120 కోట్ల వరకు అమ్మాలని డిసైడ్ అయ్యాడట . అంతేకాదు తెలుగు , తమిళం , మలయాళం , హిందీ అన్ని వెర్షన్ లు కలిపి 300 కోట్ల మార్క్ దాటేలా ప్లాన్ చేస్తున్నాడట . థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ రైట్స్ , శాటిలైట్ , హిందీ డబ్బింగ్ తదితర హక్కుల రూపంలో 300 కోట్లు అవలీలగా దాటడం ఖాయమని భావిస్తున్నాడట చరణ్ . నిజంగా చరణ్ పక్కా బిజినెస్ మెన్ కదా ! అందుకే పెట్టిన పెట్టుబడిని ముక్కుపిండి మరీ రాబడతాడు .