చరణ్ రిజెక్ట్ చేసిన కథ తో నాని చేసిన సినిమా ఇది


charan rejected nani acceptedరాంచరణ్ తో సినిమా చేయాలనీ భావించిన యువ దర్శకులు మేర్లపాక గాంధీ అతడి దగ్గరకు వెళ్లి కథ చెప్పాడట ! అయితే కథ నచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా చేయలేను అని చరణ్ రిజెక్ట్ చేసాడట ! కట్ చేస్తే అదే కథ ని నాని కి చెప్పడం వెంటనే ఓకే చేయడం సినిమా తీయడం జరిగిపోయింది . ఇంతకీ చరణ్ రిజెక్ట్ చేసి , నాని చేసిన సినిమా ఏదో తెలుసా ….. కృష్ణార్జున యుద్ధం .

 

నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్న కృష్ణార్జున యుద్ధం ఈనెల 12న భారీ ఎత్తున విడుదల కానుంది . చరణ్ రిజెక్ట్ చేసిన ఈ కథ నాని ఓకే చేయగా అది హిట్ అవుతుందా ? లేదా ? అన్న ఆసక్తి నెలకొంది . నాని గత కొంత కాలంగా వరుస విజయాలు సాధిస్తున్నాడు కాగా ఇప్పుడు విడుదల అవుతున్న కృష్ణార్జున యుద్ధం హిట్ అయ్యి నాని జోరు ని కొనసాగిస్తుందా ? లేక బ్రేక్ వేస్తుందా ? చూడాలి .