మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న రంగస్థలం


charans rangasthalam creates new record in vijayawada

ఇప్పటికే రికార్డుల మోత మోగించిన రంగస్థలం చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది . మార్చి 30న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి బాహుబలి సరసన నిలిచింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించగా చరణ్ సరసన సమంత నటించింది . చరణ్ ని సంపూర్ణ నటుడిగా తీర్చి దిద్దిన చిత్రం ఈ రంగస్థలం .

కాగా విజయవాడ లోని అప్సర థియేటర్ లో ఇప్పటికి కూడా రంగస్థలం ప్రదర్శించబడుతూ ఏకంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది . 61 లక్షలకు పైగా షేర్ వసూల్ చేసింది రంగస్థలం చిత్రం . ఇంతకుముందు ఇదే విజయవాడలో చిరంజీవి నటించిన ఇంద్ర , పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రాలు కోటి రూపాయల గ్రాస్ వసూల్ చేయగా ఇప్పుడు రంగస్థలం ఆ రికార్డులను బద్దలు కొట్టింది . 66 రోజులకు గాను ఒక కోటి 5 లక్షల 63 వేల రూపాయలు వసూల్ చేసింది దాంతో చిరంజీవి , పవన్ కళ్యాణ్ ల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు చరణ్ .

English Title: charans rangasthalam creates new record in vijayawada