అమలా పాల్ పై కేసు


charge sheet against amala paul

హీరోయిన్ అమలా పాల్ పై కేరళ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసారు . అమలా పాల్ పై కేసు నమోదు కావడానికి కారణం ఏంటో తెలుసా …… కోటి రూపాయల కారు ని నిబంధనలకు వ్యతిరేకంగా కొనడమే ! తప్పుడు చిరునామా తో కేరళ ప్రభుత్వాన్ని చీట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది కేరళ ప్రభుత్వం . అయితే 20 లక్షల పన్ను కట్టాల్సిందే అని హుకుం జారీ చేసినప్పటికీ అమలా పాల్ ఆ పన్ను కట్టకుండా మొండికేసింది . దాంతో ఛార్జ్ షీట్ నమోదయ్యింది .

అమలా పాల్ ఉండేది తమిళనాట కానీ కేరళ అడ్రస్ తో కారు కొన్నది , తప్పుడు అడ్రస్ ఇవ్వడమే కాకుండా 20 లక్షల పన్ను కూడా ఎగ్గొట్టింది . కేసు నమోదు చేసినప్పటికీ అమలా పాల్ కు ఛాన్స్ ఇచ్చారట ! పన్ను కడితే కేసు విత్ డ్రా చేసుకుంటామని చెప్పారట కానీ అమలా పాల్ మాత్రం ససేమిరా అనడంతో చేసేదిలేక చార్జిషీట్ నమోదు చేసారు . ఈ విషయంలో ఎంతదూరం వెళ్లడానికైనా సిద్దమే అని మొండి పట్టు పడుతోంది అమలా పాల్ .