డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న ఛార్మి


పాపం ! ఛార్మి కి డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదట !కొంతమంది కావాలనే ఇరికించారని అంటోంది ఛార్మి . అసలు నిప్పు లేనిదే పొగ రాదు కదా ! టాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే . బోలెడు మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి అలాగే వాళ్ళని ఇంటరాగేట్ కూడా చేసారు . అందులో ఛార్మి కూడా ఒకరు . పోలీసుల విచారణ కు హాజరై వెళ్ళిపోయింది కట్ చేస్తే రెండేళ్లు గడిచాయి డ్రగ్స్ కేసు మాత్రం మూలన పడింది . 
 
దాంతో నాకు క్లీన్ చిట్ వస్తుందని ఎప్పుడో తెలుసు ! ఎందుకంటే నాకు డ్రగ్స్ తో సంబంధం లేదు అసలు నా పేరు ఎలా బయటకు వచ్చిందో తెలీదు . ఆ సమయంలో మాత్రం నేను చాలా బాధపడ్డాను అలాగే నా కుటుంబ సభ్యులు కూడా అంటూ ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటోంది ఛార్మి . ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఇప్పుడు పూరి జగన్నాధ్ తో కలిసి సినిమాలు నిర్మించే పనిలో పడింది .