నేను చెడ్డదాన్ని అంటున్న ఛార్మి


charmi sensational comments on her love story

ప్రేమలో ఓడిపోయానని అందుకే నాకు ప్రేమపై అలాగే పెళ్లి పై అంతగా నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ హీరోయిన్ ఛార్మి . ఈ భామ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని ప్రేమించిన విషయం తెలిసిందే . అయితే అధికారికంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ సినిమా రంగంలోని వాళ్లకు పూర్తిగా ఛార్మి – దేవిశ్రీ ల ప్రేమ వ్యవహారం తెలుసు . అయితే పెళ్లి వరకు వెళుతుందన్న వాళ్ళ వ్యవహారం ముగిసిపోయింది దాంతో డిప్రెషన్ కి లోనయ్యింది ఛార్మి .

అయినా నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే అతడితో పూర్తికాలం కాపురం చేయలేక విడాకులు తీసుకునే వాళ్లమని ఎందుకంటే అతడు మంచివాడే కానీ నేనే చెడ్డదాన్ని అంటూ బాంబ్ పేల్చింది ఛార్మి . పెళ్లి చేసుకొని భర్తని చూసుకొని కాపురం చేసేంత తీరిక నాకు లేదని అందుకే పెళ్లి పై , ప్రేమ పై నాకు నమ్మకం లేదని ఇకముందు కూడా ఉండదని వేదాంతం చెబుతోంది ఛార్మి . మొత్తానికి ప్రేమలో పడి బాగానే దెబ్బతింది పాపం .