ఛార్మి ని గట్టిగా కౌగిలించుకొని ఊపిరాడకుండా చేసాడు

Ram Gopal Varma And Charmme Kaur
Ram Gopal Varma And Charmme Kaur

ఛార్మి ని గట్టిగా కౌగిలించుకొని ఊపిరాడకుండా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో పార్టీ చేసుకున్నారు ఆ చిత్ర బృందం . ఇక ఆ పార్టీలో షాంపేయిన్ ని ఊపి ఊపి హీరోయిన్ లు నిధి అగర్వాల్ , నభా నటేష్ లపై అలాగే ఛార్మి , పూరి జగన్నాధ్ లపై పోసాడు .

అంతేనా ఛార్మి ని అయితే గట్టిగా కౌగిలించుకొని ఆమెకు ఊపిరాడకుండా చేసి నలిపేసాడు వర్మ . ఈ సంఘటనతో అందరూ షాక్ అయ్యారు . అయితే ఛార్మి ఒకింత షాక్ అయినా తర్వాత తేరుకొని సంతోషంలో మునిగింది . అలాగే వర్మ పై బీరు పోసి అతడ్ని కూడా తడిపేసింది . ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .