లిక్క‌ర్ సిప్ చేస్తున్న ఆమ‌ని!

లిక్క‌ర్ సిప్ చేస్తున్న ఆమ‌ని!
లిక్క‌ర్ సిప్ చేస్తున్న ఆమ‌ని!

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `చావు కబురు చల్లగా` . అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19 న విడుదల కానుంది.  ఈ సంద‌ర్భంగా  మేకర్స్ ఈ చిత్ర‌ ప్రమోషన్లను ముమ్మరం చేశారు. శ‌నివారం ఇందులో భాగంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో ప్రముఖ నటి ఆమ‌ని వంట చేస్తూ లిక్క‌ర్ సిప్ చేస్తున్న ఫొటో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆమ‌ని గంగ‌మ్మ‌గా మాస్ పాత్ర‌లో హీరో కార్తికేయ‌కు త‌ల్లిగా న‌టించింది. లిక్క‌ర్ తాగుతున్న స్టిల్‌ని బ‌ట్టి చూస్తే ఇందులో ఆమ‌ని ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. అందుకే ఈ పాత్ర‌కు గంగ‌మ్మ అని పేరు పెట్టారు.

హీరోయిన్‌గా శుభ‌లగ్నం, మిస్టర్ పెళ్లాం వంటి చిత్రాల్లో హోమ్లీ  పాత్రలు పోషించిన ఆమ‌ని తాజా చిత్రంలో మాస్ పాత్ర‌లో అందుకు పూర్తి భిన్నంగా క‌నిపించ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఈ చిత్రంలో బ‌స్తీబాల‌రాజుగా మార్చురీ వ్యాన్ న‌డిపే డ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర కార్తీకేయ‌కు మంచి పేరుని తీసుకురావ‌డం ఖాయం అంటున్నారు.