`చావు క‌బురు చ‌ల్ల‌గా` టీజ‌ర్ టాక్: మార్చురీ డ్రైవ‌ర్ ల‌వ్‌స్టోరీ!

`చావు క‌బురు చ‌ల్ల‌గా` టీజ‌ర్ టాక్: మార్చురీ డ్రైవ‌ర్ ల‌వ్‌స్టోరీ!
`చావు క‌బురు చ‌ల్ల‌గా` టీజ‌ర్ టాక్: మార్చురీ డ్రైవ‌ర్ ల‌వ్‌స్టోరీ!

కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీ టీజ‌ర్ గ్లింప్స్‌ని చిత్ర బృందం సోమ‌వారం విడుద‌ల చేసింది.

ఇందులో కార్తికేయ ఫుల్ మాస్ పాత్ర‌లో మార్చురీ వ్యాన్‌ని న‌డిపే బ‌స్తీబాల‌రాజుగా క‌నిపించ‌బోతున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి నర్స్‌గా న‌టిస్తోంది. వీరిద్ద‌రి మధ్య సాగే విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని యువ ద‌‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి రూపొందిస్తున్నారు.  `మ‌నం ప్రేమించిన అమ్మాయిమ‌న‌కు త‌ప్ప మిగిలినోళ్లంద‌రికి సిస్ట‌ర్ అనే ఫీలింగ్ ఏదైతే వుందో అది సూప‌ర్‌ ఎహే` అని కార్తికేయ..నాలుగు పీకి నిన్ను ఇక్క‌డ ప‌డుకోబెడితే నీకు కూడా నేను సిస్ట‌ర్ అవుతాను.. అని లావ‌ణ్య త్రిపాఠి చెబుతున్న
డైలాగ్‌లు వీరిద్ద‌రి మ‌ధ్య సాగే గిల్లిక‌జ్జాల‌ని తెలియ‌జేస్తున్నాయి.

కార్తికేయ మార్చురీ వ్యాన్ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ మూవీని ఈ స‌మ్మ‌ర్‌కి రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ‌లో వ‌చ్చిన 100% ల‌వ్‌, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, ప్ర‌తి రోజు పండ‌గే చిత్రాల త‌ర‌హాలో `చావు క‌బురు చ‌ల్ల‌గా` కూడా స‌క్సెస్ సాధిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాం` అన్నారు బ‌న్నివాసు.