టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు!

టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు!
టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు!

టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు న‌మోదైంది. ‘కేరింత’, ‘మనమంత’ చిత్రాల ఫేమ్‌ హీరో విశ్వంత్ దుడుంపూడిపై బంజారా హిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సరసమైన ధరలకు లగ్జరీ కారును సొంతం చేసుకోవడం పేరిట విశ్వంత్ ప్రజలను మోసం చేశాడని చెబుతున్నారు.

విశ్వంత్ న‌మ్మించ‌డంతో చాలా మంది అత‌నికి భారీ స్థాయిలో డబ్బు చెల్లించారట‌. కానీ రోజులు గడిచినా కోద్దీ విశ్వంత్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో తమ‌ని విశ్వంత్ న‌మ్మించి మోసం చేశాడ‌ని తెలుసుకున్న వారంతా పోలీసులను సంప్రదించి అత‌నిపై ఫిర్యాదు చేశారు.

దీంతో కేసుని సీరియ‌స్‌గా తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు విశ్వంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైనందున వారు ఇప్పటివరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. విశ్వంత్  చివరిసారిగా ‘ఓ పిట్ట కథ’లో కనిపించాడు. ఈ మూవీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది.