హీరోయిన్ పై చీటింగ్ కేసు


Cheating case on Sonakshi sinha

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది . న్యూ ఢిల్లీ లో ఓ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇవ్వడంతో 37 లక్షలు చెల్లించారట నిర్వాహకులు , అయితే గత ఏడాది  సెప్టెంబర్ 30 న హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సకాలంలో హాజరుకాకపోగా వస్తున్నాను , వస్తున్నాను అంటూ మోసం చేసిందని అందుకే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆశ్రయించడంతో ప్రాథమిక సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని సోనాక్షి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు పోలీసులు .

 

సోనాక్షి సిన్హా తో పాటుగా మరో నలుగురిపై కేసు నమోదు చేసారు పోలీసులు . డబ్బులు తీసుకొని ప్రోగ్రాంకు హాజరుకాకుండా ఎగ్గొట్టింది , అయితే ఇలాంటి కేసులన్నీ ఏదో ఒక రాజీ మార్గంలో సర్దుబాటు అవుతాయి . సోనాక్షి తిరిగి డబ్బులిస్తే కేసు ని ఉపసంహరించుకుంటారు . లేకపోతే కోర్టు లో తేలాల్సిందే .

English Title: Cheating case on Sonakshi sinha