విజయ్ దేవరకొండని ఫోటో తీసిన రష్మిక మందన్న


టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా కేరళలో డియర్ కామ్రేడ్ షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం కోసం ఓ పాట ని కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

కాగా పాట చిత్రీకరణ సమయంలో మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుందన్న విషయం తెలిసిందే . ఆ గ్యాప్ లో రష్మిక మందన్న హీరో విజయ్ దేవరకొండ ని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసిందట అందులో ఒక ఫోటోని ఇది రష్మిక మందన్న తీసిన ఫోటో అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జంట తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తుండటంతో డియర్ కామ్రేడ్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఇక ఇద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది .