క‌మ‌ల్‌హాస‌న్‌ని ప్ర‌శ్నించిన పోలీసులు!


క‌మ‌ల్‌హాస‌న్‌ని ప్ర‌శ్నించిన పోలీసులు!
క‌మ‌ల్‌హాస‌న్‌ని ప్ర‌శ్నించిన పోలీసులు!

`ఇండియ‌న్‌2` చిత్రీక‌ర‌ణ చెన్నైలోని ఓ స్టూడియ‌లో వేసిన బ్యూ మ్యాట్ సెట్‌లో జ‌రుగుతుండ‌గా అక‌స్వాత్తుగా క్రేన్ విరిగిప‌డి ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచిన విష‌యం తెలిసిందే. కోలీవుడ్‌తో పాటు ఈ సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. చ‌నిపోయిన ముగ్గుకి కుటుంబాల‌కు క‌మ‌ల్ హాస‌న్ కోటి రూపాయ‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించారు.

ఆ త‌రువాత మృతుల కుటుంబాల‌ని ఆదుకోవాల‌ని, షూటింగ్ స‌మ‌యంలో లొకేష‌న్‌లో వున్న సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అలా ఏర్పాట్లు చేసిన త‌రువాతే తాను షూటింగ్‌లో పాల్గొంటాన‌ని క‌మ‌ల్ లైకాకు ఓ లేఖ రాయ‌డం దానికి కౌంట‌ర్‌గా లైకా వారు స‌మాధానం చెప్ప‌డంతో ఈ వివాదం వేడెక్కింది.

తాజాగా క్రేన్ సంఘ‌ట‌న‌పై సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగ‌ళ‌వారం హీరో క‌మ‌ల్‌హాస‌న్‌ని ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల త‌మ ముందు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లు పంపించ‌డంతో మంగ‌ళ‌వారం క‌మ‌ల్ చెన్నైలోని సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజ‌ర‌య్యారు. లొకేష‌న్‌లో ఏర్పాటు చేసిన ఏర్పాట్ల కార‌ణంగానే ఈ ప్ర‌మాద జ‌రిగిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చెన్నై పోలీసుల విచార‌ణ ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది.