సరికొత్త ప్రయత్నం – దీపిక “ఛపాక్”


సరికొత్త ప్రయత్నం – దీపిక "ఛపాక్"
సరికొత్త ప్రయత్నం – దీపిక “ఛపాక్”

బాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోయిన్ లు, హీరోలు అనే తేడా లేకుండా, నటీనటులు వ్యక్తిగతంగా సొంత మార్కెట్ క్రియేట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఇక హీరోల స్థాయిలో సక్సెస్ అవుతున్న హీరోయిన్స్ లో రాణి ముఖర్జీ, విద్యా బాలన్, కంగనా రనౌత్, దీపికా పడుకొనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దీపిక నటించి, నిర్మించిన చిత్రం ఛపాక్ రిలీజ్ అయ్యి, కమర్షియల్ గా విజయం సాధించడం తోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది.

ఇక ఈ సినిమా రెండు గంటల 3 నిమిషాలలో పూర్తి చేసారు.మొదట ఢిల్లీ నిర్భయ తరహా ఘటనకు చేపట్టిన నిరసనతో మొదలవుతుంది. మాలతి అనే ఒక సగటు అమ్మయి గాయని అవ్వాలని అనుకుంటూ, సాధారణ జీవితం గడుపుతూ ఉండగా, యాసిడ్ దాడి ఘటన ఆమె జీవితానికి సవాల్ విసురుతుంది. మొదట మాలతి డిప్రెషన్ కి గురి అయినా, నెమ్మదిగా కోలుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు అమోల్ అనే జర్నలిస్ట్ స్నేహితుడై సపోర్ట్ చేస్తాడు.

ఇక మాలతి తనకు జరిగిన అన్యాయాన్ని చట్టపరంగా ఎలా పోరాడింది.? సమాజంలో ఆమెకు ఎదురైనా సవాళ్ళు ఏంటి.? దేశంలో సగటు ఆడవారి రక్షణ విషయంలో జరుగుతున్న తప్పులు ఏంటి.? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా సినిమా చూడవలసిందే.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దీపికా నటన, శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం, మాలే ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ. ఇక సినిమా ద్వితీయార్ధం లో వచ్చే సన్నివేశాలు, స్క్రీన్ ప్లే కొంచెం సాగదీతగా అనిపిస్తాయి. కానీ పద్మావత్ వంటి చారిత్రిక నేపధ్యం ఉన్న సినిమా తరువాత దీపిక చేసిన ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నంగా ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇక సినిమా సక్సెస్ లో సింహభాగం డైరెక్టర్ మేఘనా గుల్జార్ కి దక్కుతుంది. ఇటీవల దీపిక జె.ఎన్.యూ ను సందర్శించిన నేపధ్యంలో అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, సినిమా కలెక్షన్స్ ని ప్రభావితం చేసే అంశం.