`ఛ‌పాక్` ట్రైల‌ర్ రివ్యూ: దీపిక అద‌ర‌గొట్టిందిగా!


`ఛ‌పాక్` ట్రైల‌ర్ రివ్యూ: దీపిక అద‌ర‌గొట్టిందిగా!
`ఛ‌పాక్` ట్రైల‌ర్ రివ్యూ: దీపిక అద‌ర‌గొట్టిందిగా!

`ప‌ద్మావ‌త్‌` చిత్రం త‌రువాత దీపికా ప‌దుకోన్ న‌టిస్తున్న సంచ‌ల‌న చిత్రం `ఛ‌పాక్‌`. మేఘ‌నా గుల్జార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్‌తో క‌లిసి దీపికా ప‌దుకోన్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ ఆ మ‌ధ్య రిలీజై సంచ‌ల‌నం సృష్టించింది. స‌గం కాలిన ముఖంతో దీపిక క‌నిపించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2005లో బ‌స్ కోసం ఎదురుచూస్తున్న ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై ఓ వ్య‌క్తి అక‌స్మాత్తుగా యాసిడ్ దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌లనం సృష్టించింది. పెళ్లికి నిరాక‌రించింద‌నే సాకుతో ఆగ్ర‌హించిన ఓ యువ‌కుడు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై యాసిడ్ దాడి చేసి పారిపోయాడు.

ఆమె క‌థ‌నే `ఛ‌పాక్‌` పేరుతో తెర‌పైకి తీసుకొస్తున్నారు మ‌హిళ ద‌ర్శ‌కురాలు మేఘ‌నా గుల్జార్‌. ఈ చిత్ర ట్రైల‌ర్‌ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఢిల్లీ ప్ర‌ధాన వీధుల్లో `మాకు న్యాయం కావాలి..` అని యువ‌త ఆందోళ‌న చేస్తుంటేఊ వారిపై వారిని చెద‌ర‌గొడుతున్న పోలీసుల‌ స‌న్నివేశంతో ట్రైల‌ర్ మొద‌లైంది. అంద‌రూ చూస్తుండ‌గా అంద‌మైన అమ్మాయి దీపిక (మాల‌తి) ముఖంపై ఓ యువ‌కుడు యాసిడ్ దాడి చేయ‌డం…దాన్ని త‌ట్టుకోలేక ఆ యువ‌తి నేట‌పై ప‌డి విల‌విల లాడుతున్న స‌న్నివేశాలు హృద్యంగా వున్నాయి. యాసిడ్ దాడి త‌రువాత మాన‌సికంగా కృంగిపోయిన మాల‌తి మ‌ళ్లీ తేరుకుని యాసిడ్ బాధితుల‌కు స‌పోర్ట్‌గా పోరాటం చేయ‌డం స్ఫూర్తి నిచ్చేలా వున్నాయి.

అత‌డునా ముఖాన్ని నాశ‌నం చేశాడు కానీ.. నా ఆత్మ విశ్వాసాన్ని కాదు` అంటూ దీపిక చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. యాసిడ్ దాడిలో స‌గం ముఖం కాలిన యువ‌తిగా దీపిక త‌న‌దైన న‌ట‌నతో అద‌ర‌గొట్టింది. విమ‌ర్శ‌కుల్ని సైతం మెప్పించేలా ఆమె న‌ట‌న వుండ‌టం ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా. మొత్తానికి మ‌హిళ‌ల్లో చైత‌న్యాన్ని ఆత్మ‌విశ్వాసాన్ని ర‌గిలించే చిత్రంగా ఈ సినిమా నిల‌బోతున్న‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. దీపిక తొలిసారి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించిన ఈ `ఛ‌పాక్‌` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేయ‌బోతున్నారు.