కలెక్షన్లు రావడం లేదని ఫీల్ అవుతున్నాడు


chilasow director rahul unhappy with collectionsసినిమా బాగుందని టాక్ వచ్చింది అలాగే రివ్యు లు కూడా బాగా వచ్చాయి కానీ కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదని ఫీల్ అవుతున్నాడు చి ల సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ . తెలుగులో పలు చిత్రాల్లో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాహుల్ రవీంద్రన్ చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారాడు . సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నాగార్జున చూసి రాహుల్ ని మెచ్చుకోవడమే కాకుండా తన బ్యానర్ పై విడుదల చేసాడు . నిజంగానే సినిమాకు టాక్ బాగానే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఈ సినిమాతో పాటుగా విడుదలైన గూడచారి చిత్రానికి పోయాయి దాంతో నిరాశ పడుతున్నాడు .

ఎక్కడో తేడా జరిగిందని అందుకే అనుకున్న విజయం దక్కలేదని నిట్టూర్పులు విడుస్తున్నాడు రాహుల్ . మొదటిసారి దర్శకత్వం వహించాడు కాబట్టి రాహుల్ కు అలా అనిపించడం మామూలే ! అయితే హీరో సుశాంత్ బాగానే నటించినప్పటికీ అతడికి మార్కెట్ లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది లేకపోతే ఇది మరో హీరోతో చేసి ఉంటే తప్పకుండా మరోలా ఉండేదని అంటున్నారు . మొత్తానికి రాహుల్ ఆవేదన అంతా ఇంతా కాదు , నటుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో మెగా ఫోన్ పట్టి హిట్ కొడితే అదృష్టం కానీ సక్సెస్ కాకపోతే ఇబ్బందేగా !

English Title: chilasow director rahul unhappy with collections