రోడ్డు ప్రమాదంలో బాల నటుడు మృతి


Child actor Shivalekh singh
Child actor Shivalekh singh

ఘోర రోడ్డు ప్రమాదంలో బాల నటుడు మృతి చెందాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఛతీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ వద్ద జరిగింది . కారులో తన తల్లిదండ్రులతో పాటుగా ప్రయాణిస్తున్నాడు బాలనటుడు శివలేఖ్ సింగ్ (14 ) . బిలాస్ పూర్ నుండి రాయ్ పూర్ కు వెళ్తున్న సమయంలో ఓ భారీ ట్రక్కు శివలేఖ్ సింగ్ ప్రయాణిస్తున్న కారుని బలంగా గుద్దింది .

దాంతో అక్కడికక్కడే శివలేఖ్ సింగ్ చనిపోగా అతడి తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యింది . భారీ యాక్సిడెంట్ జరగడంతో ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు . రోడ్డుపై శివలేఖ్ సింగ్ మృతదేహం చెల్లాచెదురుగా పడిపోవడంతో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి . హిందీలో పలు సీరియల్ లలో బాలనటుడిగా నటించాడు శివలేఖ్ సింగ్ . ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని అనుకుంటున్న సమయంలో ఇలా రోడ్డు యాక్సిడెంట్ కి గురి కావడంతో విషాదం నెలకొంది .