భానుప్రియ పై కేసు నమోదు కానుందా ?


Chail labour case on Actress Bhanupriya

మైనర్ బాలిక ని ఇంట్లో పనికి పెట్టుకున్న నేరానికి సీనియర్ నటి భానుప్రియ పై కేసు నమోదు కానుందా ? అంటే అవుననే తెలుస్తోంది . భానుప్రియ చెన్నై లో ని తన ఇంట్లో 14 ఏళ్ళ సంధ్య ని పనిమనిషిగా పెట్టుకుంది . మైనర్ బాలికలను ఇంట్లో పనివాళ్లుగా పెట్టుకోవడం నేరం , ఆ విషయం తెలిసి కూడా భానుప్రియ సంధ్య అనే అమ్మాయిని పనికి పెట్టుకుంది .

 

అయితే పని చేసే అమ్మాయి భానుప్రియ ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించి అమ్మకు ఇవ్వడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . దాంతో వస్తువులను తెచ్చి ఇస్తామన్న సంధ్య అమ్మ ఆంధ్రప్రదేశ్ లో భానుప్రియ పై ఆమె సోదరుడి పై కేసు పెట్టింది , అయితే విచారణలో అవి వాస్తవం కాదని తేలింది కానీ మైనర్ బాలిక కావడంతో ఇప్పుడు భానుప్రియ మెడకు కేసు చిక్కు పడేలా ఉంది . మైనర్ బాలిక ని పనికి పెట్టుకున్నారని తెలిస్తే జైలు శిక్ష లేదా నష్టపరిహారం తప్పకపోవచ్చు . అయితే కేసు నమోదు చేయడం ,అరెస్ట్ చేయడం మాత్రం తప్పకపోవచ్చని అంటున్నారు .

English Title: Child labour case on Actress Bhanupriya