హంకాంగ్‌‌పై ప‌ట్టుకోసం జిమ్మీని అరెస్ట్ చేసిన చైనా!హంకాంగ్‌‌పై ప‌ట్టుకోసం జిమ్మీని అరెస్ట్ చేసిన చైనా!
హంకాంగ్‌‌పై ప‌ట్టుకోసం జిమ్మీని అరెస్ట్ చేసిన చైనా!

క‌రోనా వైర‌స్‌తో యావ‌త్ ప్ర‌పంచాన్ని ప్ర‌మాదంలోకి నెట్టింది చైనా. ఈ దేశానికి చెందిన పూహాన్ న‌గ‌ర మార్కెట్ స‌మీపంలోని ల్యాబ్ నుంచి పుట్టిన క‌రోనా వైర‌స్ గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌పంచాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని చైనా చాలా కాలంగా దాచేస్తోంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న మేధావి వ‌ర్గాలు బాహాటంగానే అంటున్నాయి. ఇక మ‌న దేశానికి చెందిన ఢిల్లీ ముఖ్య‌‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇది చైనా పుట్టించిన వైర‌స్ అని బాహాటంగానే ప్ర‌క‌టించారు. ఇదిలా వుంటే వైర‌స్‌కు సంబంధించిన విష‌యాల్ని చైనా మీడియా ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌నివ్వకుండా చైనా ఉక్కు పాదం మోపుతోంది.

తాజాగా స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి కోసం ప్ర‌య‌త్నిస్తున్న హాంకాగ్ ప్ర‌జ‌ల్ని చైనా అణిచివేస్తోంది. ప్ర‌జ‌ల ప‌క్షాణ నిల‌బ‌డి త‌న గొంతుక వినిపిస్తున్న హాంకాంగ్ కు చెందిన మీడియా అధినేత జిమ్మీ లైని జాతీయ భద్రతా చ‌ట్టం కింద అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. హాంకాగ్‌లో జిమ్మీలైని ప్ర‌జ‌లంతా హీరోగా అభివ‌ర్ణిస్తుంటారు. తమ త‌రుపున నిల‌బ‌డి చైనా నియంతృత్వాన్ని ప్ర‌శ్నించ‌డంతో ఏనాడూ వెనుకాడ‌ని జిమ్మీలైని తాజాగా చైనా ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకుని అత‌నిపై దేశ ద్రోహం కేసుని న‌మోదు చేసింది.

హంకాంగ్‌లో జిమ్మీ లై యాపిల్ అనే డైలీని,  ఓ మ్యాగజైన్‌ని, రెండు ట్యాబ్లైడ్‌ల‌ని నిర్వ‌హిస్తున్నారు. హంకాంగ్‌లో ప్ర‌జాస్వామ్య అనుకూలుర‌ను ప్రోత్స‌హిస్తూ చైనాను జిమ్మీ బాహాటంగా విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. బీజింగ్ తెచ్చిన సెమీ అటాన‌మ‌స్ చ‌ట్టం హాంకాంగ్‌కు మ‌ర‌ణ‌శాసం అని జిమ్మీ చైనా ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో అత‌న్ని  దేశ ద్రోహిగా చిత్రించిన చైనా రెస్ట్ చేయ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.