చినబాబు ఓవర్ సీస్ టాక్


chinnababu overseas talk

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చినబాబు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యింది అయితే ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి , కాగా ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఎలా ఉందో తెలుసా …… …. పెద్ద హిట్ కాదు కానీ కార్తీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ఓవర్ సీస్ ప్రేక్షకులు . కార్తీ రైతు గా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడట అక్కడ ! ఓవర్ సీస్ జనాలకు ఈ రైతు సినిమా నచ్చితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింతగా నచ్చడం ఖాయం .

విభిన్న కథా చిత్రం కాదు కానీ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్న ఈ చిత్రంతో కార్తీ విజయం సాధించినట్లే అని అంటున్నారు . పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ అన్నయ్య హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం . తెలుగు , తమిళ బాషలలో విడుదలైన ఈ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు కార్తీ . ఈ హీరో తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు . గతకొంత కాలంగా సక్సెస్ కొట్టలేక పోతున్న కార్తీ ఖాకీ చిత్రంతో హిట్ అందుకున్నాడు ఇక ఇపుడేమో దానికి కొనసాగింపుగా చినబాబు ఉంది .

కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ , సాయేషా సైగల్ , సత్యరాజ్ , సూరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు .

English title: chinna babu overseas talk