కార్తీ సినిమా కలెక్షన్లు ఇంత దారుణమా


chinna babu shocking collections on first day

తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన చినబాబు నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు నిన్న షాక్ అయ్యే కలెక్షన్లు వచ్చాయి , రెండు తెలుగు రాష్ట్రాలలో చినబాబు కి వచ్చిన షేర్ ఎంతో తెలుసా ……. ….. 83 లక్షలు . అత్యంత దారుణమైన వసూళ్లు ఇవి . కార్తీ కి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది అయితే గతకొంత కాలంగా ఈ హీరో నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందడంతో వసూళ్లు మందగించాయి .

చినబాబు సినిమా కంటే ముందు వచ్చిన ఖాకీ సినిమా హిట్ అయినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రమే దాంతో కావచ్చు ఈ సినిమాకు అంతగా కలెక్షన్లు రాలేదు . దేనికంటే ముందు విడుదలైన చిన్న సినిమా …… ఏమాత్రం అంచనాలు లేని ” ఆర్ ఎక్స్ 100” చిత్రానికి మొదటి రోజున కోటిన్నర షేర్ రాగా రెండో రోజున కోటి వచ్చింది దాంతో రెండు రోజుల్లోనే రెండున్నర కోట్ల షేర్ వచ్చింది . కానీ స్టార్ హీరో అయినా కార్తీ చిత్రానికి మాత్రం కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది కానీ ఎందుకో వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి . ఈరోజు శనివారం , రేపు ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు వసూళ్లు మెరుగు అవుతాయో చూడాలి .

నిన్న వసూల్ అయిన వివరాలు ఇలా ఉన్నాయి

నైజాం – 19 లక్షలు
సీడెడ్ – 13 లక్షలు
ఉత్తరాంధ్ర – 11 లక్షలు
ఈస్ట్ – 7 లక్షలు
వెస్ట్ – 6 లక్షలు
కృష్ణా – 7. 6 లక్షలు
గుంటూరు – 16 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
మొత్తం – 0. 83 లక్షలు

English Title: chinna babu shocking collections on first day