`ఆచార్య‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

`ఆచార్య‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!
`ఆచార్య‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. దేవాదాయ భూముల స్కాం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంప‌నీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ చిత్ర టీజ‌ర్‌ని ముందు చెప్పిన‌ట్టుగానే శుక్ర‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు చిత్ర బృందం విడుద‌ల చేసింది. టీజ‌ర్‌కి రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. `ఇత‌రుల కోసం జీవించేవారు దైవంతో స‌మానం. అలాంటి వారి జీవితాలే ప్ర‌మాదంలో ప‌డితే.. ఆ దైవ‌మే వ‌చ్చి కాపాడాల్సిన ప‌నిలేదు` అంటూ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్‌తో మొద‌లైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

టీజ‌ర్ చివ‌ర్లో `పాఠాలు చెప్పే అల‌వాటు లేక‌పోయినా అంతా ఎందుకో ఆచార్య అంటుంటారు. బ‌హుషా గుణ‌పాఠాలు చెబుతాన‌నేమో` అంటూ మెగాస్టార్ చివ‌ర్లో పంచ్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ టీజ‌ర్ ఇప్ప‌టికే నిమిషాల వ్య‌వ‌ధిలో వ‌న్ మిలియ‌న్ వ్యూస్ ని దాట‌డం విశేషం. కొర‌టాల మార్కు సందేశంతో.. చిరు మార్కు జ‌ర్కుల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు.