కింగ్ నాగార్జున ప‌రిస్థితేంటి?


కింగ్ నాగార్జున ప‌రిస్థితేంటి?
కింగ్ నాగార్జున ప‌రిస్థితేంటి?

క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో దీని ప్ర‌భావం తీవ్రంగా క‌నిపించింది. అయితే ఇటీవ‌ల అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డం.. దైనందిన జీవితం మ‌ళ్లీ రోడ్డెక్క‌డంతో క‌రోనా అంటే చాలా మందిలో భ‌యం కాస్తా పోయి నిర్ల‌క్ష్యం మొద‌లైంది. తీవ్ర‌త త‌గ్గింది మ‌న‌కేం కాదులే అనే నిర్ల‌క్ష్యం సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల్లోనూ క‌నిపించ‌డం మొద‌లుపెట్టింది. దీంతో వైర‌స్ మ‌ళ్లీ ప్ర‌బ‌ల‌డం మొద‌లుపెట్టింది.

ఈ ద‌ఫా సెల‌బ్రిటీల్లో చాలా మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఓ సంగీత కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి రావ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు క‌రోనా సోకింద‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని జాత‌డ‌గ్ర‌త్త‌లు పాటించే డా. రాజ‌శేఖ‌ర్ క‌రోనా బారిన ప‌డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని స్వ‌యంగా ఆయ‌న సతీమ‌ణి జీవిత స్ప‌ష్టం చేశారు కూడా. ఇఇలా వుంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు.

ఈ విష‌యాన్ని ఆయ‌న సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అంతే కాకుండా గ‌త నాలుగైదు రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను` అని వెల్ల‌డించారు. దీంతో తెరాస వ‌ర్గాలు, నాగ్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. రెండు రోజుల క్రితం నాగ్‌తో క‌లిసి చిరంజీవి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని క‌లిశారు. ఆయ‌న‌ని ప్ర‌త్యేకంగా క‌లిసి వ‌ర‌ద సాయాన్ని అందించారు. ఈ క్ర‌మంలో చిరు ముఖానికి మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డంతో నాగ్‌తో పాటు సీఎం కేసీఆర్ కూడా క్వారెంటైన్‌కి వెళ్లాల్సిందేనా? అని అంతా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.