మ‌న‌బిడ్డ మ‌న‌కంటే ఎత్తుకు ఎద‌గాల‌ని


మ‌న‌బిడ్డ మ‌న‌కంటే ఎత్తుకు ఎద‌గాల‌ని
మ‌న‌బిడ్డ మ‌న‌కంటే ఎత్తుకు ఎద‌గాల‌ని

అకీరా నంద‌న్‌.. మెగా ఫ్యామిలీ లెగ‌స్సీని అందిపుచ్చుకుని ముందుకు నడిపించే ఫ్యాచ‌ర్ స్టార్‌. ఇది మెగా ఫ్యామిలీకీ తెలుసు. మెగా ఫ్యాన్స్‌కీ తెలుసు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి ముందే ప‌సిగ‌ట్టారు. అందుకే అత‌ని గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా స్పందించారు. ఈ బుధ‌వారం ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

అకీరా నంద‌న్ పెద‌నాన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం అకీరా గురించి ప్ర‌త్యేకంగా స్పందించారు. ఇటీవ‌లే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాప్టార్ యంగ్ హీరోల‌కి మించి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటూ వ‌రుస ట్వీట్లతో అద‌ర‌గొడుతున్నారు. ప్ర‌తీ విష‌యంలో స్పందిస్తూ అందరూ స్పందించేలా చేస్తున్నారు.

బుధ‌వారం ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ ట్వీట్ చేశారు. `మ‌న బిడ్డ మ‌న‌కంటే ఎత్తుకు ఎద‌గాలని కోరుకుంటుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ ఎత్తులో అంద‌రికంటే ఎదిగిపోయాడు (6’4స‌స‌). అన్ని విష‌యాల్లో కూడా అంద‌రిని ఇలానే మించిపోవాలి. అత‌నికి ప‌వ‌ర్‌ఫుల్ భ‌విష్య‌త్తు వుండాలి. హ్యాపీ బ‌ర్త్‌డే అకీరా` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter