చిరు కోసం రోడ్డున ప‌డ్డ అభిమాని!చిరు కోసం రోడ్డున ప‌డ్డ అభిమాని!
చిరు కోసం రోడ్డున ప‌డ్డ అభిమాని!

మూవీ స్టార్స్‌ని చాలా మంది డెమీ గాడ్స్ (దైవాంశ సంభూతులు) భావిస్తూ వుంటారు. వారిని ఆరాధిస్తూ వుంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. న‌చ్చిన హీరో సినిమా వ‌చ్చిందంటే వారికి పండ‌గే. థియేట‌ర్లో న‌చ్చిన హీరో కోసం ఓ అభిమాని చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే అది హ‌ద్దులు దాట‌నంత వ‌ర‌కే అభిమానం హ‌ద్దులు దాటితే భ‌ట్టు బాలాజీ జీవితంలా మారుతుంది.

మ‌హ‌బూబాబాద్ భ‌వానీ న‌గ‌ర్‌కు చెందిన భ‌ట్టు బాలాజీ మెగాస్టార్ చిరంజీవికి వీర ఫ్యాన్‌. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే గుంపుతో థియేట‌ర్ల‌కి తొలి రోజు తొలి ఆట‌కు వెళ్లాల్సిందే. అభిమానం పేరుతో చిరు కోసం భ‌ట్టు బాలాజీ కుటుంబాన్ని లెక్క‌చేయ‌కుండా ఖ‌ర్చు చేసి ఉన్న ఆస్తిని త‌గ‌లేశాడు. దీంతో అత‌నితో పాటు అత‌ని కుటుంబం రోడ్డున ప‌డింది. ప్ర‌స్తుతం దీనావ‌స్థ‌లో వున్న త‌న కుటుంబాన్ని ఆదుకోమ‌ని చిరుని వేడుకుంటున్నాడు.

కానీ అత‌ని గోడు వినేవారు లేరు. చిరుని క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తే ప‌ట్టించుకున్న వాళ్లు లేరు. దీంతో అత‌ని దీన గాథ మీడియా కెక్కింది. చిరు బ్ల‌డ్ బ్యాంక్ ప్రారంభిస్తే ఊరి నుంచి వంద మందిని తీసుకెళ్లి ర‌క్త‌దానం చేయించాడ‌ట‌. ఇందుకు అయిన ఖ‌ర్చుల‌న్నీ భ‌ట్టు బాలాజీనే భ‌రించాడ‌ట‌. అంతే కాకుండా ప్ర‌జారాజ్యం పార్టీ కార్య‌క్ర‌మాల కోసం త‌న మూడెక‌రాల భూమిని కూడా అమ్మేశాడ‌ట దీంతో ఆస్తుల‌న్నీ పోయి ప్ర‌స్తుతం భ‌ట్టు బాలాజీ రోడ్డున ప‌డ్డాడు. అత‌ని కుటుంబాన్ని చిరు ఆదుకోవాల‌ని అంతా కోరుకుంటున్నారు. మ‌రి చిరు క‌రుణిస్తారా అన్న‌ది వేచ‌యి చూడాల్సిందే.