పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిన చిరంజీవి


chiranjeevi challenges pawan kalyan

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి సవాల్ విసిరాడు . చిరు పవన్ కు సవాల్ విసరడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరారని అనుకుంటున్నారా ? కాదు హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరాడు . హరితహారం లో పాల్గొంటున్న పలువురు ప్రముఖులు మొక్కలు నాటి మరో ముగ్గుర్ని నామినేట్ చేస్తున్నారు మొక్కలు నాటమని , దాంతో ఆ సవాల్ ని స్వీకరిస్తున్న వాళ్ళు కూడా మొక్కలు నాటి ప్రకృతిని పచ్చదనంతో నింపడానికి సహకారం అందిస్తూ మరో ముగ్గుర్ని నామినేట్ చేస్తున్నారు .

ఇక చిరంజీవి విషయానికి వస్తే మూడు మొక్కలు నాటి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ని అలాగే మీడియా దిగ్గజం రామోజీరావు లతో పాటుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా నామినేట్ చేసాడు .చిరు విసిరిన సవాల్ ని పవన్ ఎప్పుడు స్వీకరిస్తాడో ? ఎక్కడ మొక్కలు నాటుతాడో ?అతడు మళ్ళీ ఎవరిని సవాల్ చేస్తాడో చూడాలి . తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండగా అన్నయ్య చిరంజీవి సినిమాల్లో బిజీ అవుతున్నాడు . ప్రస్తుతం సైరా …… నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు చిరు .

English Title: chiranjeevi challenges pawan kalyan