బాల‌య్య స్పందించారు.. చిరు ట్వీటేశారు!


బాల‌య్య స్పందించారు.. చిరు ట్వీటేశారు!
బాల‌య్య స్పందించారు.. చిరు ట్వీటేశారు!

క‌రోరా కార‌ణంగా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. బుధ‌, గురు, శుక్ర‌వారాల్లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు యావ‌త్ భార‌తంలో క‌రోనా పాజిటివ్ కేసులు సంక్ష ప్ర‌మాద స్థాయిని తాకుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని మ‌రింత క‌ఠ‌న‌త‌రం చేయాలి అని, లాక్ డౌన్‌ను ద‌శ‌ల వారీగా తొల‌గిస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే లాక్ డౌన్ కార‌ణంగా చాలా మంది రోజు వారి కార్మికులు ప‌ని కోల్పోయారు. ముఖ్యంగా సినీ కార్మికుల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా త‌యారైంది. దీంతో సినీ స్టార్స్ ముందు కొచ్చి సినీ కార్మికుల తో పాటు స‌మాన్య నం కోసం అటు ప్ర‌భుత్వాల‌కు, ఇటు సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా స్టార్ హీరో బాల‌కృష్ణ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు 50, 50 ల‌క్ష‌లు అందించారు.

సినీ కార్మికుల కోసం 25 ల‌క్ష‌ల చెక్కుని సీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ సి.క‌ల్యాణ్‌కి అంద‌జేశారు. దీనిపై  సీసీసీ చైర్మ‌న్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. థ్యాక్యూ డియ్ బ్ర‌ద‌ర్ బాల‌కృష్ణ ఎన్‌బీకే  25 ల‌క్ష‌లు క‌రోనా క్రైసిస్ చారిటీ నిధికి, 50 ల‌క్ష‌లు తెలంగాణ సీఎం స‌హాయ‌ నిధికి, మ‌రో 50 ల‌క్ష‌లు ఏపీ సీఎం స‌హాయ నిధికి అంద‌జేశారు. ప్ర‌తి క‌ష్ట స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter