అమ్ముల పొదిలోంచి వ‌దిలిన రామ‌బాణం!


అమ్ముల పొదిలోంచి వ‌దిలిన రామ‌బాణం!
అమ్ముల పొదిలోంచి వ‌దిలిన రామ‌బాణం!

ఉగాది సంద‌ర్భంగా `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ టైటిల్ లోగో టీజ‌ర్‌ని రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. తాజాగా దీని నుంచి జ‌నం తేరుకోక‌ముందే మ‌రో స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ని అందించింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని రాజ‌మౌళి మెగా ప‌వ‌ర్‌స్టార్ లుక్‌కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపిస్తున్న తీసు రోమాంచితంగా వుంది. అత‌నిపై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు.. సీతారామరాజు పాత్ర‌ని అభివ‌ర్ణిస్తూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవ‌ర్ సినిమాని పీక్స్‌కి తీసుకెళ్లింది.

రామ్‌చ‌ర‌ణ్‌కు ఇచ్చిన మ‌ర్చిపోలేని గిఫ్ట్ అంటూ ఎన్టీఆర్ అందించిన స‌ర్‌ప్రైజ్ అదిరిపోయింది. ఈ వీడియో చూసిన మెగాస్టార్ చిరంజీవి `ఆర్ ఆర్ ఆర్` టీమ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. భీం ఫ‌ర్ రామ‌రాజు అనే హ్యాష్ ట్యాగ్‌ని జ‌త చేస్తూ అద‌రింది రాజ‌మౌళి.. మీ అమ్ముల పొదిలోంచి వ‌దిలిన రామ‌బాణం ఈ సీతారామ‌రాజు. అమోఘం తార‌క్‌. దుమ్ము లేపారు. మాలో ఉత్సాహాన్ని నింపారు. చ‌ర‌ణ్ ఎప్పిటికీ మ‌ర్చిపోలేని స‌ర్‌ప్రైజ్  గిఫ్ట్‌ని అందించారు తార‌క్ అని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. హీరోయిన్‌లుగా అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో హాలీవుడ్ న‌టుడు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.