అనుమానాలను బద్దలుకొట్టిన చిరంజీవి


Chiranjeevi
Chiranjeevi

సైరా నరసింహారెడ్డి చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే అనుమానాలు ఉండేవి , దానికి తోడు సైరా విడుదల వాయిదా పడటం ఖాయం అంటూ వచ్చిన వార్తలపై నిప్పులు చల్లి ఆ అనుమానాలను బద్దలుకొట్టాడు మెగాస్టార్ చిరంజీవి . ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల అవుతోందని స్పష్టం చేసాడు చిరంజీవి .

తాజాగా చిరంజీవిని తన కోడలు అయిన ఉపాసన ఇంటర్వ్యూ చేసింది . ఉపాసన హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తోంది . దాంతో ఆ మ్యాగజైన్ కోసం చిరు కోడలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు . అందులో భాగంగానే సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2 న విడుదల అవుతోందని స్పష్టం చేసాడు . అంటే ఇంకా ఆ సినిమా పై అనుమానాలు అన్నీ పటాపంచలు అయినట్లే !