ముఖ్యంమత్రిని కలవడానికి వెళ్తున్న చిరంజీవి దంపతులు


Chiranjeevi Couple Went to meet Andhra Pradesh CM Jagan Mohan Reddy
Chiranjeevi Couple Went to meet Andhra Pradesh CM Jagan Mohan Reddy

సైరా నరసింహా రెడ్డి‘ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి విలువ మరింత పెరిగింది. తెలుగు సినిమా గొప్పతనం కూడా బాహుబలి తర్వాత ఆకాశానికి వెళ్ళిపోయింది. అలాంటి గొప్పతనం పొందిన సైరా సినిమా సభ్యులు ప్రతి రోజు జనాల దగ్గరికి వెళ్ళిపోతూ సినిమా గురించి వారు పడ్డ కష్టం గురించి మీడియా ముందు వివరించుకుంటున్నారు.

సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సమానమైన పాత్ర ఇచ్చినందుకు ముందుగా దర్శకులు ‘సురేందర్ రెడ్డి’ గారికి ప్రత్యేక అభినందనలు దక్కాయి. ఇక ఎప్పటినుండో కలవాలి అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి అయిన ‘వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి‘  గారి నుండి సైరా యూనిట్ తరపున స్యయంగా ముఖ్యంమత్రి గారే చిరంజీవి దంపతులని భోజనానికి ఆహ్వానించారు. వారికి స్పెషల్ గా ఒక విమానాన్ని కూడా ఏర్పాటు చేసారు.

ఇక ఆహ్వానం వచ్చిన చిరంజీవి దంపతులు వెంటనే అమరావతికి బయలు దేరారు…. చిరంజీవి గారి దంపతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళుతున్న చిరంజీవి గారు మరియు వారి సతీమణి కొణిదెల సురేఖ గారు విమానం లో ప్రయాణించడానికి వెళుతున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయిపోతుంది.

ఇక ఇన్ని రోజులు బిజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చిరంజీవి దంపతులని ఇలా భోజనానికి పిలవడం చిరంజీవి గారి సినిమాల మీద ఉన్న అమితమైన ప్రేమ అని జగన్ గారి అనుచరులు అనుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదట సైరా సినిమాకి అడ్డుగా థియేటర్ సమస్యలు తలెత్తితే జగన్ మోహన్ రెడ్డి గారి వారి వల్లనే ఆ సమస్య తీరిపోయిందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో  సినిమా ఘన విజయం సాదిస్తుందని సినిమాకి వచ్చిన కలెక్షన్లు చూసి చెప్పవచ్చు.