మళ్ళీ తల్లి అవుతున్న చిరంజీవి చిన్న కూతురు


 sreeja is pregnant again

చిరంజీవి చిన్న కూతురు మరోసారి తల్లి అవుతోంది దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీజ తల్లి కాబోతున్నట్లు సంతోషంగా ప్రకటించాడు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ . శ్రీజ నెలతప్పడంతో మెగా కుటుంబం ఆనందంతో మురిసిపోతోంది . 2016 మార్చి 28 న శ్రీజ పెళ్లి కళ్యాణ్ దేవ్ తో జరిగిన విషయం తెలిసిందే . ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగిన శ్రీజ పెళ్ళికి అతిరధ మహారథులు హాజరయ్యారు . చిన్న కూతురు పెళ్లి అట్టహాసంగా చేయాలనీ ఆశపడిన చిరు ఎట్టకేలకు తన అభీష్టానికి తగ్గట్లుగా పెళ్లి జరిపించాడు . శ్రీజ ని పెళ్లి చేసుకున్నాక కళ్యాణ్ దేవ్ సినిమాలపై దృష్టి పెట్టాడు . హీరోగా నటించాలనే ఆసక్తిని మామ చిరంజీవి కి తెలియజేయడంతో ” విజేత ” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ సక్సెస్ కొట్టలేకపోయాడు .

శ్రీజ మొదట ప్రేమ వివాహం చేసుకోగా అప్పట్లో ఆ పెళ్లి పెద్ద సంచలనం సృష్టించింది . ఆ పెళ్ళికి గుర్తుగా ఒక కూతురు పుట్టింది శ్రీజ కు . ఆ తర్వాత మొదటి భర్త భరద్వాజ్ తో విబేధాలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చింది . దాంతో కూతురు శ్రీజ ని చేరదీసాడు చిరు , మళ్ళీ పెళ్లి చేసి తన బాధ్యతలను దించుకున్నాడు . కళ్యాణ్ – శ్రీజ లు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు దాంతో మెగా కుటుంబం మొత్తం సంతోషంలో మునిగి తేలుతున్నారు . దీపావళి పండగ మెగా కుటుంబంలో ముందే వచ్చేసింది .

English Title: Chiranjeevi daughter Sreeja is pregnant again