పది లక్షల విరాళం ఇచ్చిన చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి రాఘవ లారెన్స్ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ 10 లక్షల విరాళం అందించాడు . నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన కాంచన 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తరుపున అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించాడు అలాగే చెక్ అందించాడు . లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” కాంచన 3” . హర్రర్ నేపథ్యంలో రూపొందిన కాంచన 3 రేపు తెలుగు , తమిళ బాషలలో ఏకకాలంలో విడుదల కానుంది .

లారెన్స్ తమిళనాడులో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 150 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించిన విషయం తెలిసిందే . అయితే తనని ఇంతవాడిని చేసిన తెలుగు ప్రేక్షకుల ఋణం కూడా తీర్చుకోవాలని భావించిన లారెన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు సేవ అందించడానికి ఇక్కడ కూడా గుండె ఆపరేషన్ లు చేయించడానికి నడుం కట్టాడు దాంతో మెగాస్టార్ చిరంజీవి తనవంతు విరాళంగా పది లక్షల విరాళం అందించాడు .