కోటి విరాళం ఇచ్చిన చిరంజీవి


chiranjeevi-doneted-one-crore-for-homeo-college

మెగాస్టార్ చిరంజీవి కోటి విరాళం ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది . చిరంజీవి ఏంటి ? కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఏంటి ? అని ఆశ్చర్య పోతున్నారు అయితే చిరంజీవి ఇప్పుడే కాదు పలు సందర్భాల్లో స్పందించి విరాళాలు ఇచ్చాడు అయితే ఈమధ్య కాలంలో తక్కువ కాబట్టి పిల్లికి బిచ్చం వేయని చిరంజీవి కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు . ఇంతకీ చిరు విరాళం ఇచ్చింది దేనికో తెలుసా ……..

రాజమండ్రి లోని అల్లు రామలింగయ్య హోమియో కళాశాల కు ఈ విరాళం ఇచ్చాడు చిరు . ఈ విషయం కూడా బయటకి తెలిసింది రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ వల్ల . తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కళాశాల కు కోటి రూపాయల విరాళం ఇవ్వడంతో చిరు ని అభినందించడానికి వచ్చాడు మురళీమోహన్ . చిరు కి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపి ఆ తర్వాత మీడియాకు తెలిపాడు మురళీమోహన్ . అల్లు రామలింగయ్య చిరు మామ అన్న విషయం తెలిసిందే .