రెండో పెళ్లి చేసుకున్న చిరంజీవి మాజీ అల్లుడు


చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు . హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనని రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు శిరీష్ భరద్వాజ్ . గతకొంత కాలంగా డాక్టర్ విహన తో ప్రేమాయణం సాగిస్తున్న శిరీష్ భరద్వాజ్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు . అంతేకాదు కొంతమందికి ఎక్కడో కాలాలి కాబట్టి తన పెళ్లి విషయాన్నీ ప్రకటించాడు అలాగే తన భార్యతో కూడిన ఫోటోని షేర్ చేసాడు శిరీష్ భరద్వాజ్ .

చిరు చిన్న కూతురు శ్రీజ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్ అయితే ఒక బిడ్డ పుట్టాక ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి దాంతో అదనపు కట్నం తేవాలంటూ టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తూ శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టింది శ్రీజ . అలాగే 2014 లో ఇద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు . శ్రీజ కళ్యాణ్ దేవ్ ని మళ్ళీ పెళ్లి చేసుకోగా శిరీష్ భరద్వాజ్ కూడా తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు .