చిరంజీవి మనవరాలు పేరేంటో తెలుసా


Chiranjeevi Granddaughter name NAVISHKA

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు మరో  కూతురు పుట్టిన విషయం తెలిసిందే . కాగా ఆ అమ్మాయికి తాజాగా పేరు పెట్టారు , ఇంతకీ చిరు చిన్న మనవరాలికి పెట్టిన పేరు ఏంటో తెలుసా …….. ” నవిష్క ” అంటే ఎప్పుడు నిత్య నూతంగా ఉండటం అంట . ఈ విషయాన్నీ తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ . క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25న శ్రీజ కూతురు కి జన్మనిచ్చింది .

అయితే తాజాగా ఆ పాపకు నామకరణం చేసారు మెగా కుటుంబీకులు , చిన్న మనవరాలు రావడం …… కొత్త సంవత్సరం రావడం అంతా ఒకేసారి జరగడంతో మెగా కుటుంబంలో ఆనందం తాండవిస్తోంది . శ్రీజ కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . సినిమాలపై ఆసక్తి ఉన్న కళ్యాణ్ దేవ్ ” విజేత ” చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు దాంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ నటించడానికి రెడీ అవుతున్నాడు .

English Title: Chiranjeevi Granddaughter name  NAVISHKA