అందుకే మెగాస్టార్‌కు ఈ రోజు ప్ర‌త్యేకం!


అందుకే మెగాస్టార్‌కు ఈ రోజు ప్ర‌త్యేకం!
అందుకే మెగాస్టార్‌కు ఈ రోజు ప్ర‌త్యేకం!

మెగాస్టార్ చిరంజీవి సోమ‌వారం ఓ ట్వీట్ చేశారు. త‌న‌కు ఏప్రిల్ 8తో ప్ర‌త్యేక అనుబంధం వుంద‌ని.. అయితే అభిమానుల్లో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్‌.. బ‌న్నీ బ‌ర్త్‌డే గురించి చిరు ట్వీట్ చేశారా?  లేక ప‌వ‌న్ త‌న‌యుడు అకీరా బ‌ర్త్‌డే గురించి ట్వీట్ చేశారా? అని క‌న్ఫ్యూజ‌న్ అయ్యారు. అయితే ఆయ‌న ఏప్రిల్ 8 త‌నకు ప్ర‌త్యేకం అని చెప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణం బుధ‌వారం ఆయ‌న ఇష్ట‌దైవం శ్రీఆంజ‌నేయ స్వామి జ‌యంతి కావ‌డ‌మే.

బుధ‌వారం ఆయ‌న అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. `ఈ రోజు హ‌నుమ‌జయంతి. ఆంజ‌నేయ స్వామితో నాకు చాలా అనుబంధం వుంది. చిన్న‌ప్ప‌టి నుంచి 1962లో నాకు ఓ లాట‌రీలొ ఈ బొమ్మ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఆ బొమ్మ నా ద‌గ్గ‌ర అలాగే భ‌ద్రంగా వుంది. ఉంది అని చెప్ప‌టం కంటే దాచుకున్నాను అని చెప్ప‌డం క‌రెక్ట్‌. కార‌ణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న‌గారు, ఆ క‌నుబొమ్మ‌లు, క‌ళ్లు, ముక్కు అచ్చం నీకు లానే ఉన్నాయి`అన్నారు. అప్ప‌టి నా ఫోటో అంటూ త‌న చిన్న‌నాటి ఫొటోని షేర్ చేశారు చిరు.

కొన్ని ద‌శాబ్దాల త‌రువాత‌, 2002లో.. బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్ట‌మైన ఆంజ‌నేయ‌స్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నునే అది పాలరాతి మీద అచ్చు వేయించి పూజ గ‌దిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ‌నాకు ఇచ్చేట‌ప్పుడు ఆయ‌న ఏమ‌న్నారో తెలుసా…? `ఏంటోనండీ.. బొమ్మ‌గీస్తుంటే మీ పోలిక‌లే వ‌చ్చాయండీ.. అలానే ఉంచేసాను. మార్చ‌లేదు` అన్నారు. చిత్ర కారుల ఊహ‌ల్లో స్వామివారి పోలిక‌లు నాకు ఉండ‌టం చిత్ర‌మే. అంద‌రికి హ‌నుమ‌జ్జ‌యంతి శుభాకాంక్ష‌లు. ఇవాల్టి తారీఖుతో నాకు అనుబంధం ఉంది.. అంటూ మెగాస్టార్ చిరంజీవి త‌న‌కు ఆంజ‌నేయ స్వామిపై త‌న‌కున్న అపార‌మైన భ‌క్తి భావాన్ని ప్ర‌ద‌ర్శించారు.

Credit: Twitter