చిరు మేనల్లుడికి అల్లుడి కి రాజీchiranjeevi hopes on two movies

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు అల్లుడు కళ్యాణ్ దేవ్ కు రాజీ కుదిర్చాడు మెగాస్టార్ చిరంజీవి . ఇద్దరికీ రాజీ కుదర్చడం ఏంటి అని అనుకుంటున్నారా ? మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ” తేజ్ ఐ లవ్ యు ” జూలై 6న విడుదల అవుతుండగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం ” విజేత ” .కాగా ఆ చిత్రాన్ని జూలై 12 న విడుదల చేయనున్నారు . అయితే ఈ సినిమాలు వారం రోజుల వ్యవధిలో విడుదల కావడానికి తెరవెనుక చిరంజీవి కారణం అట !

ఎందుకంటే ఒకరేమో మేనల్లుడు , మరొకరు చిన్న కూతురు భర్త కావడంతో ఇద్దరూ ఒకేసారి పోటీపడటం వల్ల ఇబ్బందులు తప్పవు కాబట్టి చిరంజీవి జోక్యం చేసుకొని సాయి ధరమ్ తేజ్ సినిమా ని జూలై 6 న విడుదల అయ్యేట్లు కళ్యాణ్ దేవ్ సినిమా జూలై 12న విడుదల అయ్యేట్లు ప్లాన్ చేసాడు . రెండు సినిమాలు బాగుంటే రెండూ ఆడతాయి కాబట్టి వారం గ్యాప్ చాలు అని డిసైడ్ అయ్యాడట చిరు . సాయి ధరమ్ తేజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు , కాగా కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అవుతున్న సినిమా కాబట్టి ఇద్దరికీ హిట్ కావాలి అందుకే మెగాస్టార్ ఇలా ప్లాన్ చేసాడు .

English Title: chiranjeevi hopes on two movies