చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న సైరా వివాదం


Chiranjeevi
Chiranjeevi

సైరా నరసింహారెడ్డి చిత్రం తీయడం ఏమో కానీ చిరంజీవి ఇమేజ్ మాత్రం వివాదాల మూలంగా డ్యామేజ్ అవుతోంది . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చేయాలనీ చిరంజీవి ఫిక్స్ అయ్యింది మొదలు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది . అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనే తన 150 వ సినిమాగా చేయాలనీ అనుకున్నాడు మొదట అలాగే పరుచూరి బ్రదర్స్ గట్టిగా పట్టుబట్టారు కూడా . కానీ కం బ్యాక్ సినిమా కదా ప్రేక్షకులు తనని ఎలా ఆదరిస్తారో అని ఖైదీ నెంబర్ 150 చేసాడు . పెద్ద హిట్ కొట్టాడు దాంతో నమ్మకం కుదిరింది అందుకే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు .

అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులతో రకరకాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి . రెండేళ్లుగా అవి పరిష్కారం కావడం లేదు సరికదా సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపథ్యంలో మరింతగా ముదురుతున్నాయి . ఇటీవలే చరణ్ ఇంటి ముందు ధర్నా చేసారు . నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు కోట్లలో కానీ చరణ్ ఇస్తానన్నది ఇంకా సెట్ కాలేదు . సినిమా విడుదల అయ్యేలోపు ఈ వివాదాలు సద్దుమణుగుతాయా ? లేక మరింత పెద్దవి అవుతాయా ? చూడాలి .