మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!


మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!
మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం త‌రువాత చిరు వెంట‌నే మ‌రో చిత్రాన్ని మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు. స‌మ‌కాలీన అంశం నేప‌థ్యంలో సందేశాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రెజీనా స్పెష‌ల్ సాంగ్‌తో పాటు పలు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఈ చిత్రంలో 30 నిమిషాల పాటు సాగే ఓ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర వుంద‌ట. ఈ క్యారెక్ట‌ర్‌ని రామ్‌చ‌ర‌ణ్ చేత చేయించాల‌ని చిరుతో పాటు కొర‌టాల శివ భావించార‌ట‌.

ఆ త‌రువాత అదే పాత్ర కోసం మ‌హేష్‌ని సంప్ర‌దించార‌ని, రెమ్యున‌రేష‌న్ ఎక్క‌వ‌గా డిమాండ్ చేయ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రికి కీల‌క అతిథి పాత్ర కోసం రామ్‌చ‌ర‌ణ్‌నే ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. అయితే తాజాగా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన చిరంజీవి కీల‌క అతిథి పాత్ర విష‌యంలో మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నార‌ని అడిగితే త్వ‌ర‌లో చూస్తారుగా` అంటూ ట్విస్టివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.