దాస‌రిపై చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

దాస‌రిపై చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!
దాస‌రిపై చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

`తాత – మ‌న‌వ‌డు` చిత్రంతో ద‌ర్శ‌క‌ర‌త్న డా. దాసరి నారాయ‌ణ‌రావు సినీ ప్రస్థారం మొద‌లైంది. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న దాస‌రి 140 చిత్రాల వ‌ర‌కు తెర‌కెక్కిచారు. ద‌ర్శ‌కుడు అన్న ప‌దానికి వ‌న్నె తెచ్చారు. డైరెక్ట‌ర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్‌ అని బ‌లంగా వాదించి ద‌ర్శ‌కుడికి గౌర‌వాన్ని తీసుకొచ్చారు దాస‌రి. ఆయ‌న 77వ జ‌యంతి నేడు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ గ‌త కొన్ని రోజులుగా యాక్టీవ్‌గా ట్వీట్‌లు పెడుతున్నారు. తాజాగా దాసరి 77వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్ట‌డ‌మే కాకుండా దాసరితో క‌లిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు.

దా.. దానంలో క‌ర్ణుడు మీరు

స‌… స‌మ‌ర్ధ‌త‌లో అర్జునుడు మీరు

రి.. రిపు వ‌ర్గ‌మేలేని ధ‌ర్మ‌రాజు మీరు

మీరు మా మాధ్య లేక‌పోయినా మీ స్ఫూర్తి ఎఉప్పుడూ స‌జీవంగానే వుంటుంది. ప్ర‌తి భావిద‌ర్శ‌కుడి జీవితానికి మ‌ర్గ‌క‌మ‌వుతుంది` అంటూ ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి.