ఆగస్టు 22 న చిరంజీవి – కొరటాల సినిమా ప్రారంభం


ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి కొత్త సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్న చరణ్ 152 చిత్రాన్ని కూడా బయటి నిర్మాతలకు ఇవ్వడం లేదు.

ఆగస్టు 22 న లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ సినిమాని 2020 లో ఉగాది కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అంటే సామాజిక సందేశం తో పాటుగా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక సైరా విషయానికి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి ని పురస్కరించుకుని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ , నయనతార , జగపతిబాబు , తమన్నా , నిహారిక , విజయ్ సేతుపతి తదితరులు నటించారు సైరా చిత్రంలో .