చిరు -కొరటాల సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా


chiranjeevi and koratala siva
chiranjeevi and koratala siva

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఇటీవలే ఆ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది దాంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే . సామాజిక సందేశంతో తెరకెక్కనున్న కమర్షియల్ చిత్రం ఇది . ఇక ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల కానుందో తెలుసా ……. 2020 ఉగాది కి .

సైరా రిలీజ్ కాకముందే కొరటాల సినిమాలో పాల్గొననున్నాడు చిరు . దాంతో 2020 ఫిబ్రవరి కల్లా షూటింగ్ పార్ట్ పూర్తిచేసి వేసవిలో ఉగాది కానుకగా విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు . ఇక రిలీజ్ కి చాలా సమయం ఉంది కాబట్టి తప్పకుండా ఉగాది కానుక మెగా ఫ్యాన్స్ కి అందించడం ఖాయం . మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు .