`లూసీఫ‌ర్` రీమేక్‌ ప‌ట్టాలెక్కేందుకు అంతా సిద్ధం!

`లూసీఫ‌ర్` రీమేక్‌ ప‌ట్టాలెక్కేందుకు అంతా సిద్ధం!
`లూసీఫ‌ర్` రీమేక్‌ ప‌ట్టాలెక్కేందుకు అంతా సిద్ధం!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుంతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆచార్య‌`లో న‌టిస్తున్నారు. దేవాదాయ భూముల కుంభ కోణం చుట్టూ అల్లుకున్న క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో సిద్ధాగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌‌టిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దుది ద‌శ‌కు చేరుకుంది. ఇదిలా వుంటే మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌. ప‌రాస్‌జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే లాంఛ‌నంగా ముహూర్తం జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఏప్రిల్ నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అవి పూర్తి కాగానే టీమ్ ఈ రీమేక్‌ని ప‌ట్టాలెక్కించ‌నుంద‌ని తాజా టాక్‌. అంతే కాకుండా ఆరు నెల‌ల్లో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.