చిరు లూసిఫెర్ రీమేక్ మొదలుపెట్టబోయేది అప్పుడే!


చిరు లూసిఫెర్ రీమేక్ మొదలుపెట్టబోయేది అప్పుడే!
చిరు లూసిఫెర్ రీమేక్ మొదలుపెట్టబోయేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ముందు కొంత మంది దర్శకులను అనుకున్నా కానీ చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజాకు ఈ అవకాశం దక్కింది. రీమేక్ స్పెషలిస్ట్ గా మోహన్ రాజాకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి లూసిఫెర్ రీమేక్ కు ఓటు వేసాడు ఈ దర్శకుడు.

ఎన్వీ ప్రసాద్ తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇటీవలే సత్యదేవ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం లూసిఫెర్ రీమేక్ పనులు జనవరి 20 నుండి మొదలవుతాయని సమాచారం.

ప్రస్తుతం జనవరి 10 వరకూ మెగాస్టార్ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటారు. దీంతో మేజర్ షెడ్యూల్ పూర్తవుతుంది. దాని తర్వాత సంక్రాంతి సెలవులు తీసుకోనున్న చిరంజీవి 20 నుండి లూసిఫెర్ టీమ్ కు అందుబాటులోకి రానున్నారు. సమ్మర్ కల్లా అటు ఆచార్య, ఇటు లూసిఫెర్ సినిమాలను పూర్తి చేయాలన్నది చిరు టార్గెట్.

చూడాలి మరి అది ఎంతవరకూ నెరవేరుతుందో.