బెన‌ర్జీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన చిరంజీవి

chiranjeevi-met-with-benarjee-familyసినీ న‌టుడు బెన‌ర్జీ తండ్రి, న‌టుడు రాఘ‌వ‌య్య ఆదివారం ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతిప‌ట్ల టాలీవుడ్ దిగ్ర్బాంతిని వ్య‌క్తం చేసింది. తాజాగా ప్ర‌ముఖ  హీరో చిరంజీవి  సోమ‌వారం ఉదయం  బెన‌ర్జీ ని స్వ‌యంగా ఆయ‌న ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించారు. రాఘ‌వ‌య్య మృతిప‌ట్ల చిరంజీవి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా  చిరంజీవి  ఆయ‌న తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.