`ఆచార్య` ఫైన‌ల్ అయిన‌ట్టేనా?


`ఆచార్య` ఫైన‌ల్ అయిన‌ట్టేనా?
`ఆచార్య` ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

ఒక సినిమా రిలీజ్ త‌రువాత మ‌రో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావ‌డానికి స్టార్ హీరోలు టైమ్ తీసుకుంటుంటారు కానీ ఈ మ‌ధ్య పంథా మార్చారు. ఒక సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంటే మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెడుతున్నారు. తాజాగా `సైరా` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా థియేట‌ర్ల‌లో వుండ‌గానే మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టేశారు.

ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్‌చ‌రణ్‌తో క‌లిసి కొర‌టాల శివ స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిరు ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జ‌రుగుతోంది. కోకా పేట‌లో 40 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అక్క‌డే ప‌లు కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తార‌ట‌.

క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కి సామాజిక సందేశాన్ని జోడించి సినిమాల్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే పంథాలో రూపొందిస్తున్నారు. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం `ఆచార్య` అనే టైటిల్‌ని చిత్ర బృందం రిజిస్ట‌ర్ చేయించింది. ఇదే టైటిల్ ఫైన‌ల్అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌డా క‌నిపిస్తున్నాయి.