మెగాస్టార్ నామినేట్ చేసింది వీరినే..!


మెగాస్టార్ నామినేట్ చేసింది వీరినే..!
మెగాస్టార్ నామినేట్ చేసింది వీరినే..!

టాలీవుడ్‌లో `బి ద రియ‌ల్ మెన్` ఛాలెంజ్ వైర‌ల్‌గా మారుతోంది. సెల‌బ్రిటీలంతా ఈ ఛాలెంజ్‌ని సీరియ‌స్‌గా తీసుకుంటూ వ‌న్ బై వ‌న్ వీడియోల‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తున్నారు. మ‌రి కొంత మందిని నామినేట్ చేస్తున్నారు. సందీప్ వంగ మొద‌లుపెట్టి ఈ ఛాలెంజ్ వైర‌ల్‌గా మారుతూ వ‌స్తోంది.

తాజాగా ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మెగాస్టార్ చిరంజీవి గురువారం ఉద‌యం త‌న‌కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. వాక్యూమ్ క్లీన‌ర్‌తో ఇంటి ఫ్లోర్‌ని క్లీన్ చేసిన చిరు ఆ త‌రువాత కిచ‌ల్‌లోకి ఎంట‌రై ఛెఫ్ త‌ర‌హాలో ఉక్మా పెస‌ర‌ట్టుని వేసి వేడి ఏడి అట్టుని త‌న త‌ల్లి అంజ‌నాదేవ‌మ్మ‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా వేడి వేడి ఉక్మా పెస‌ర‌ట్టుని తింటూ కొంత త‌న‌యుడు చిరుకి తినిపించ‌డం ఆక‌ట్టుకుంది.

ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్‌కి త‌న‌ని నామినేట్ చేయ‌డంతో దాన్ని దృష్ట‌లో పెట్టుకున్న చిరు ` ఇదిగో భీమ్ నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం.. అంటూ వీడియోని షేర్ చేస్తూ తాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని, త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ర‌జ‌నీ ఇంట ప‌నుల్లో ఎలాంటి స్టైల్‌ని చూపిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Credit: Twitter