మెగాస్టార్ ని ఒప్పిచలేకపోయిన కొరటాల


మెగాస్టార్ ని ఒప్పిచలేకపోయిన కొరటాల
మెగాస్టార్ ని ఒప్పిచలేకపోయిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152 ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేయబోతున్నట్లు ప్రాజెక్ట్ మొదట్లో టాక్ వచ్చింది. ఎలాగూ కొరటాల అతన్నే సెలెక్ట్ చేసుకుంటాడాని అంతా భావించారు.

కానీ రాక్ స్టార్ గతంలో మాదిరిగా మ్యూజిక్ ఇవ్వడం లేదని మెగాస్టార్ బాలీవుడ్ టెక్నీషియన్స్ పై కన్నేశాడు. ఇన్నిరోజులు సైరా పనుల్లో బిజీగా ఉండడంతో ఎవరిని ఫిక్స్ చేయలేక పోయారు. అయితే ఆ గ్యాప్ లో మెగాస్టార్ ని కన్విన్స్ చేయాలని అనుకున్న కొరటాల శివ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు.
తన గత సినిమాలైనా మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను సినిమాలకు దేవి మంచి మ్యూజిక్ ఇచ్చాడని ఎలాగైనా మళ్ళీ అతన్నే మెగాస్టార్ సినిమా కోసం సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ మెగాస్టార్ బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ ద్వయం అజయ్ – అతుల్ లని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రానుంది. మరి ఆ టాప్ టెక్నీషియన్స్ ఎలాంటి సంగీతాన్ని అందిస్తారో చూడాలి.