చిరంజీవి పొలిటికల్ లైఫ్ క్లోజా


chiranjeevi quit politics

2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి అయితే సినిమారంగంలో రారాజుగా వెలుగొందిన చిరంజీవి రాజకీయంగా మాత్రం ఘోర పరాజయం పొందాడు దాంతో ప్రజారాజ్యం ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ కు వెళ్ళాడు . కట్ చేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది , ఇక అప్పటి నుండి రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి కనబరచడం లేదు చిరంజీవి . త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు రానున్నాయి కానీ చిరంజీవి మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు .

అంటే ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లే అని అంటున్నారు చిరు సన్నిహితులు . తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జనసేన పార్టీలో చేరిన సందర్బంగా అన్నయ్య చిరంజీవి ని ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్ ఇక అన్నయ్య జీవితం సినిమాలకే అంకితం అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పాడు , దాంతో చిరంజీవి పొలిటికల్ లైఫ్ క్లోజ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

చిరంజీవి రీ ఎంట్రీ లో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రికార్డుల మోత మోగించాడు . దాంతో ఇక సినిమాలపైనే దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యాడట . తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ” సైరా ……. నరసింహారెడ్డి ” చిత్రంలో నటిస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో రూపొందిస్తున్నారు .